KCR | రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం.. ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 12న పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం వివరాలు వెల్లడించాయి.
KCR | హైదరాబాద్, మే 10(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 12న పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం వివరాలు వెల్లడించాయి. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి కొనసాగింపుగా మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి ప్రతిపక్ష నేతతో పాటు మండలి, శాసనసభాపక్షాల డిప్యూటీ లీడర్లు హాజరుకానున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్చార్జుల నియామకం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్యనేతలకు కేసీఆర్ కీలక సూచనలు చేసి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్టు సమాచారం. అదేవిధంగా పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కార్పొరేషన్ల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS meeting
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

