KCR Health | కేసీఆర్ అనారోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా ఛానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ఫై అసత్య ప్రచారాలు చేస్తూ.. ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తలు పుట్టిస్తున్నాయని మండిపడింది.
కేసీఆర్ ఆరోగ్యంపై చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ కోరింది. కేసీఆర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. ఇవాళ ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సీనియర్ నేతలు హరీశ్‌రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో సమావేశమయ్యారని తెలిపింది. మీడియా సంస్థలు వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేసింది.
ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు, @BRSHarish, @mahmoodalibrs, @TPadmaRao, @BrsSabithaIndra లతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ https://t.co/fULw77XwVF pic.twitter.com/qWluR5QO6C
— BRS Party (@BRSparty) September 26, 2025