BRS Party | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. సీఎం రేవంత్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేసింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓయూలో నీటి కొరత, కరెంట్ కోత అంశాన్ని సోమవారం ఎక్స్ వేదికగా పోస్టు చేయడం, అది వైరల్‌గా మారడం.. డిప్యూటీ సీఎంసహా వివిధ శాఖల అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి కూడా దీనిపై స్పందించి ‘ఫేక్’లో కాలేసినట్టుగా తెలుస్తున్నది. ప్రతి సంవత్సరం వర్సిటీ హాస్టళ్లు, మెస్‌లకు సెలవులు ప్రకటించడం సాధారణమేనని, నిరుడు కూడా కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నట్టుగా పాత నోటీసును జత చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఓయూ విద్యార్థి నాయకుడు నాగేందర్రావు కొడాటి ఎక్స్ వేదికగా స్పందించాడు. అది ఫేక్ నోటీస్ అంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఫేక్ నోటీసు ఎలా పోస్టు చేస్తారంటూ అసలు నోటీసు ఇది అంటూ పాత నోటీసును జత చేశారు. సీఎం పోస్టు చేసిన నోటీసులో ఈ ఏడాది మాదిరిగానే కరెంటు కోతలు, నీటి కొరత ఉన్నదని అందులో పేర్కొనగా… నాగేందర్రావు పోస్టు చేసిన నోటీసులో కేవలం ఒక నెల సమ్మర్ సెలవులు ఇస్తున్నట్టుగానే ఉన్నది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
సీఎం రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ.
ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్‌ను ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈసీకి వినతి. pic.twitter.com/fjqEPgrjjI
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2024