అమ్రాబాద్, సెప్టెంబర్ 10 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఎంకే గార్డెన్స్‌లో నిర్వహించిన అమ్రాబాద్, పదర ఉమ్మడి మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరితో నష్టపోతున్నట్టు ప్రజలకు వివరించాలని అ న్నారు. అధికారంలోకి వచ్చిన 21 నె లల్లో రేవంత్ సర్కారు ఇచ్చిన హామీ లు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. వారి వైఫల్యాలను ఊరూరా ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పాలని చెప్పారు.
ఇది మ్యాజిక్ కాదు.. కేసీఆర్ విజన్ ; రికార్డు స్థాయిలో తగ్గిన శిశుమరణాలే సాక్ష్యం మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2011-13లో 41.2%గా ఉన్న శిశుమరణాల రేటు 2021-23 నాటికి 18శాతానికి చేరిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో చారిత్రాత్మకంగా 52% శిశుమరణాలు తగ్గినట్టు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇది మ్యాజిక్ కాదని.. కేసీఆర్ విజన్, కార్యాచరణకు నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన మాతాశిశు సంక్షేమ కార్యక్రమాలు వేలమంది చిన్నారుల ప్రాణాలు నిలిపినట్టు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు సత్ఫలితాలు ఇవ్వడంతో దేశమే తెలంగాణ వైపు చూసేలా చేశారని కొనియాడారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే నిజమైన తెలంగాణ మాడల్ అని స్పష్టంచేశారు. మరో వైపు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.