BRS | మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఆ రెండు నియోజకవర్గాల్లోని అన్ని సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. పార్టీ శ్రేణులను ఎన్నికల సమాంగణంలోకి దింపడం, పార్టీ అధినాయకత్వం ఇచ్చే మార్గదర్శకాలు, దిశానిర్దేశాన్ని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పార్టీ శ్రేణులకు తెలియజేసి కార్యక్షేత్రంలో నిత్యం ముందుకు సాగడమే లక్ష్యంగా ఈ సమన్వయకర్తలు పనిచేస్తారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.
* మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో
మేడ్చల్ – శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ
మల్కాజ్గిరి- నందికంటి శ్రీధర్
కుత్బుల్లాపూర్ – గొట్టిముకుల వెంగళరావు
కూకట్పల్లి- బేతి రెడ్డి సుభాశ్ రెడ్డి
ఉప్పల్- జహంగీర్ పాషా
సికింద్రాబాద్(కంటోన్మెంట్) – రావుల శ్రీధర్ రెడ్డి
ఎల్బీనగర్- బొగ్గరపు దయానంద్ గుప్తా
* చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో
మహేశ్వరం – స్వామి గౌడ్
రాజేంద్రనగర్ – పుట్టం పురుషోత్తం రావు
శేరిలింగంపల్లి – కే. నవీన్ కుమార్
చేవెళ్ల – నాగేందర్ గౌడ్
పరిగి- గట్టు రామచంద్రరావు
వికారాబాద్ – పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
తాండూర్ – బైండ్ల విజయ్ కుమార్