హైదరాబాద్: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయసభల్లో చర్చించబోయే అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై చర్చించనున్నారు.