పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్‌లోని(Basant Nagar) కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ(Kesoram cement factory) గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరితో పాటు ఆయన ప్యానల్(BRS panel) ఘనవిజయం సాధించింది. మొత్తం 788 ఓట్లు పోలవగా కౌశిక్ హరి ప్యానల్ 418, బయ్యపు మనోహర్ రెడ్డి ప్యానెల్‌కు351, దేవీ లక్ష్మీనరసయ్య ప్యానల్‌కు 1, నరేష్‌కు 9 లభించాయి ఇందులో 7 ఓట్లు చెల్లలేదు. కౌశిక్ హరి ప్యానల్ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పటాకులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.