కాంగ్రెస్‌ను నమ్మొద్దు
రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మోసాల పార్టీ అని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. 60 ఏండ్ల ఆ పార్టీ పాలనలో అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు.
- 60 ఏండ్ల ఆ హస్తం పార్టీ పాలనలో మనం అరిగోసపడ్డాం
- మూడు గంటల కరెంట్ కావాల్నా.. మూడు పంటల బీఆర్ఎస్ కావాల్నా
- ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి
పాలకుర్తి రూరల్, నవంబర్ 26: రైతాంగానికి మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ మోసాల పార్టీ అని బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. 60 ఏండ్ల ఆ పార్టీ పాలనలో అరిగోస పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ర్టాన్ని మరింత అభివృద్ధిచెందాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని కోతులాబాద్, అయ్యంగారిపల్లి, తిరుమలగిరి, ముత్తారం, తొర్రూరు జే, రాఘవపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మోసాల కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మవద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం లోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు నడుస్తుంటే.. టీ పీసీసీ అధ్యక్షుడు రైతాంగానికి మూడు గంటల కరెంట్ ఇస్తాననడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలిచ్చే బీఆర్ఎస్ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు. కొందరు కాంగ్రెస్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని రాజకీయ బ్రోకర్లుగా మారారని మండిపడ్డారు. అలాంటి వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 40 ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. కొత్తగా అమెరికా నుంచి వచ్చిన వారికి ప్రజల కష్టసుఖాలు ఏం తెలుసని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానని హామీనిచ్చారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలను అభివృద్ధి చేసిన తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్‌రావు, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- Electricity
- farmers
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

