హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడ ర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పెట్రోలి యం, సహజవాయువు పా ర్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్లో శుక్రవారం ప్రారంభమైన ఈ అధ్యయన యాత్ర ఈ నెల 27 వరకు కొనసాగనున్నది. యాత్రలో భాగంగా స్థాయీ సంఘం సభ్యులు తొలిరోజు చమురు, సహజవాయువు సంస్థ(వోఎన్జీసీ)కు చెందిన ఉరాన్ ప్లాంట్‌ను సందర్శించారు.
ప్లాంట్ కార్యకలాపాలు, పెట్రోలియం-సహజవాయువు రంగానికి సంబంధించిన అంశాలను పరిశీలించారు. అనంతరం స్థాయీ సం ఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తటరే అధ్యక్షతన ‘ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిస్థితులు-పెట్రోలియం రంగంపై వాటి ప్రభా వం’ అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. ఎంపీ వద్దిరాజు తన అభిప్రాయాలను వెల్లడించారు. పెట్రోలియం రంగం పై పడుతున్న ప్రభావం, ఇంధన భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.