హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తేతెలంగాణ): నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయంలో దక్షిణాదికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆందోళనలు, సందేహాల ను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో కీలకభూమికను పోషిస్తున్నదని చెప్పారు.
డీలిమిటేషన్, రాష్ట్రాల హక్కులపై పార్లమెంట్లో సమగ్రంగా చర్చించాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. చర్చల ప్రక్రియలో కప్ అండ్ సాసర్ థియరీని పా టించాలని కేంద్రానికి విన్నవించారు. లోక్‌సభ కప్పులా, రాజ్యసభ సాసర్ మాదిరిగా రెండు సభలను చర్చల్లో సమాన భాగస్వాములను చేయాలని కోరారు. ఫెడరల్ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టంచేశారు.