హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎన్రావు, ఏపీలోని పశు వైద్య వర్సిటీలు, పరిశోధనా కేంద్రాల గ్రంథాలయాలకు ‘రైతన్నకు వెన్నుదన్ను-కలంగళం దృశ్యం’ పుస్తకాలను అందజేశారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియాలో ఉంటున్న డాక్టర్ డీఎన్రావు.. పాడిరంగంలో విశేష కృషిచేసిన శాస్త్రవేత్తగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.
పశునేస్తం సంపాదకులుగా ‘పశునేస్తం పదకోసం’ పేరుతో డిక్షనరీని రూపొందించారు. పశు వైద్యుల సేవలు, వారి అనుభవాలతో రూపొందించిన 70 పుస్తకాలను తెలుగు రాష్ర్టాల్లోని పశు వైద్య వర్సిటీలకు అందించినట్టు గురువారం ప్రకటనలో వెల్లడించారు.