హైకోర్టులో సీఎం రేవంత్‌కు ఊరట
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి, మార్చిల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో నాడు మలాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి అనుచిత విమర్శలు చేయడంపై బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు. రేవంత్‌రెడ్డి కింది కోర్టు విచారణకు మినహాయింపు ఇచ్చిన న్యాయమూర్తి, కౌంటరు దాఖలు చేయాలని గండ్ర రమణారెడ్డిని ఆదేశించారు. విచారణను మార్చి 5 నాటికి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

