మంచిర్యాల, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఆరు నూరైనా.. బీఆర్ఎస్, సీపీఐ పార్టీలే చైర్మన్, వైస్ చైర్మన్ కావాలి. ఎన్నికల్లో క్యాతన్‌పల్లి మున్సిపల్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 22 వార్డుల్లో 10 వార్డుల్లో బీఆర్ఎస్, 4 వార్డుల్లో సీపీఐ కూటమిని గెలిపించారు. కాంగ్రెస్‌కు ఏడు సీట్లు ఇచ్చారు. న్యాయంగా బీఆర్ఎస్-సీపీఐ కలిసి ఇక్కడ పాలకవర్గా న్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ.. బీఆర్ఎస్-సీపీఐ కూటమి నుంచి చైర్మ న్, వైస్ చైర్మన్లు ఎన్నిక కాకుండా మంత్రి వివేక్ అడ్డుకుంటున్నారు. రా జ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నడు..” అంటూ తిరగబడిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుపై మంచిర్యాల జిల్లా ప్రజానీకం ఏకమైంది.

న్యాయం కోసం, ప్రజాతీర్పును అమలు చేయడానికి పోరాడుతున్న సు మన్కు అండగా నిలిచింది. సుమన్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా బం ద్‌కు సంపూర్ణ మద్దతిచ్చింది. సుమన్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులపై లాఠీఛార్జి చేయించి.. ఉల్టా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. అన్ని మండలాల్లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులు నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాల్క సుమన్‌ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ తీశారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో దుకాణాలు, వ్యాపార సముదాలు మూసివేసి స్థానికులు బంద్‌లో పాల్గొన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బంద్ పాటించారు. మందమర్రి, భీమారం, జైపూర్, కోటపల్లి మండలాల్లో బంద్ సంపూర్ణంగా సాగింది. మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గ కే్రందంతోపాటు తాం డూర్, కాసిపేట, నెన్నెల మండల కేంద్రాల్లో బంద్ పాటించారు. బీఆర్ఎస్ జిల్లా బంద్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నిరసనలు తెలపడం, ఆందోళనలు చేయడానికి అనుమతి లేదంటూ పలుచోట్ల పోలీసులు బీఆర్ఎస్ కార్యక్రమాలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో కొద్దిమందితోనే ర్యాలీ తీశారు. బీఆర్ఎస్ ర్యాలీ సందర్భంగా పోలీసులు అనుమతి లేదంటూ వీడియోలు తీస్తూ కనిపించిచారు. బంద్ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తిరుగుతున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి నస్పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. భీమారం మండలంలో బంద్ పాటిస్తున్న వ్యాపారులను పోలీసులు బంద్ పాటించొద్దని ఒత్తిడి తెచ్చారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. పోలీసుల ఆంక్షలున్నప్పటికీ బంద్ సంపూర్ణంగా సాగింది.