Vinod Kumar | పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో గులాబీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రచారం హోరెత్తుతోంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా కార్యకర్తలు ప్రచారంలో మునిగిపోయారు. ఇక వినోద్ కుమార్ పేరు మీద విడుదలైన సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలంగాణ లొల్లిని ఢిల్లీలో పెట్టి.. లోక్సభనే షేక్ చేసిన గులాబీ గర్జన వాడు.. వినోద్ కుమార్ను గెలిపించుకోవాలంటూ కరీంనగర్ గడ్డపై ఆ సాంగ్ గర్జిస్తోంది. వాని కణం కణం తెలంగాణ.. వాని నరం నరం కరీంనగరం అంటూ ఎన్నికల రణక్షేత్రంలో రంకెలేస్తోంది పాట.
కరీంనగర్ గళం.. దళం.. బలం.. బోయినపల్లి వినోద్ కుమార్.#ParliamentElection2024 #Boianapallivinodkumar #KTR #Telangana #VoteForCar #BRSParty #KCR #karimnagar pic.twitter.com/sSc4H5cvmh
— B Vinod Kumar (@vinodboianpalli) April 7, 2024