హైదరాబాద్ : కేంద్రం పీవీ నరసింహారావుకు భారతరత్న (Bharat Ratna ) ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(BRS MLCs) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనమండలి ఆవరణలో పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణి దేవిని కల్వకుంట్ల కవిత, సత్యవతి, రమణ , మాజీ మంత్రి మహముద్ అలీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని పీవీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ మట్టిబిడ్డకు దక్కిన అరుదైన గౌరవమని ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత(MLCs Kavitha) అన్నారు. పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న దక్కటం అంటే తెలంగాణ ప్రజలకే కాదు యావత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన డిమాండ్‌పై సానుకూల నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆమె వెల్లడించారు.