జగిత్యాల, జూలై 4: కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్ గంగారం (ఎల్జీ రాం) (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ రమణకు ఫో న్ చేసి పరామర్శించారు. గంగారం మృతికి సంతాపం ప్రకటించి వారి కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ వద్దిరాజు రవిచం ద్ర, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రెడ్డి, సుభాశ్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు.