Telangana | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు పార్లమెంట్ సరిగ్గా తొమ్మిదేండ్ల క్రితం ఇదే రోజున ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టం!! కేసీఆర్ గారు చరిత్ర సృష్టించిన రోజు ! కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తికి మెప్పు పొంది, ప్రత్యేక తెలంగాణకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన శుభదినం. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భం. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్ నిరూపించిన రోజు అని కవిత తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టం!!కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తికి మెప్పు పొంది, ప్రత్యేక తెలంగాణకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసిన శుభదినం. రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయని చాటిన సందర్భం. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్ నిరూపించిన రోజు pic.twitter.com/b40yt1mT4a
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2023