MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. ఆమె వెంట భర్త అనిల్, కేటీఆర్ ఉన్నారు. కాగా, శంషాబాద్ ఎయిర్పోర్టులో కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
కాగా, ఢిల్లీలోని తన నివాసం నుంచి ఎయిర్పోర్టుకు బయల్దేరే ముందు ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. న్యాయం గెలిచిందని అని అన్నారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
#WATCH | BRS leader K Kavitha says, “I always believe that justice will prevail, truth will prevail. We will fight back…We will not lose our resolve and we will continue our fight…”
(Source: BRS) pic.twitter.com/ExJqaeaLL3
— ANI (@ANI) August 28, 2024