MLC Kavitha | హైదరాబాద్, జులై 16 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఆమె ను తీహార్ జైలు అధికారులు మంగళవారం ఢిల్లీలోని దీన్‌దయాళ్ ఉపాద్యా య దవాఖానకు తరలించి ఆరోగ్యపరీక్షలు నిర్వహించినట్టు తెలిసింది.
జ్వరంతోపాటు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు గుర్తించిన జైలు అధికారులు ఆమెను పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. కవిత అస్వస్థత గురించి జైలు అధికారులు అధికారికంగా ఏమీ వెల్లడించలేదు. అయితే, ఈ విషయమై బుధవారం న్యాయస్థానానికి వివరాలు అందించే అవకాశం ఉన్నది.