MLC Kavitha | న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది.
ఈ కేసులో కవిత పాత్రపై సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. ఈ ఛార్జీషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిగింది. అనంతరం ఆమెకు 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు కోర్టు తెలిపింది.