MLC Kavitha | సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు జలాశయాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకులు ఇవాళ ఉదయం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు వచ్చారు. అక్కడ చాలాసేపు సరదాగా గడుపుతూ వీడియోలు తీసుకున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుండగా వారంతా డ్యామ్‌లో పడి గల్లంతయ్యారు. వాళ్లందరూ డ్యామ్‌లో పడి గల్లంతయ్యారు. ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు. మిగిలిన ఇద్దరిని సురక్షితంగా కాపాడగలిగారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
కొండపోచమ్మ సాగర్‌లో సెల్ఫీ కోసం ఏడుగురు దిగగా మునిగి ఐదుగురు యువకుల మృతి
హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం
మొత్తం ఏడుగురు గల్లంతు కాగా బయటపడ్డ ఇద్దరు
కొండపోచమ్మ రిజర్వాయర్‌లో చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు
1. దనుష్ s/o నర్సింగ్,… pic.twitter.com/5x2XfXie7U
— Telugu Scribe (@TeluguScribe) January 11, 2025
మృతులను ధనుష్ (20), లోహిత్(17), చీకట్ల దినేశ్వర్ (17), సాహిల్ (19), జతిన్ (17)గా గుర్తించారు. బతికి బయటపడ్డ వారిని కొమారి మృగాంక్ (17), ఎండీ ఇబ్రహీం (20)గా గుర్తించారు.