పొంగులేటి వ్యాఖ్యలు సంసారహీనం
ప్రజలు ఇచ్చిన తాతాలిక అధికారాన్ని చూసుకొని కండ్లు నెత్తికెకిన కాంగ్రెస్ ప్రభుత్వమే తన పొలిటికల్ బ్యాలెన్స్ పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు.
- సమాధానం చెప్పలేక దిగజారుడు మాటలా?
- మెంటల్ బ్యాలెన్స్ తప్పింది హరీశ్‌రావుకు కాదు
- అధికార అహంకారంతో విర్రవీగుతున్న మంత్రి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 29(నమస్తే తెలంగాణ) : ప్రజలు ఇచ్చిన తాతాలిక అధికారాన్ని చూసుకొని కండ్లు నెత్తికెకిన కాంగ్రెస్ ప్రభుత్వమే తన పొలిటికల్ బ్యాలెన్స్ పూర్తిగా కోల్పోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు. మీరిచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చే దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు రాజకీయంగా సమాధానం చె ప్పే దమ్ములేక మెంటల్ బ్యాలెన్స్ తప్పిందనడం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అహంకారానికి, సంసారహీనతకు నిదర్శనమంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి పొంగులేటిపై పలు కీలక అంశాలను లేవనెత్తుతూ నిప్పులుచెరిగారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి శారీరక వైకల్యాన్ని రాజకీయ విమర్శలకు వాడుకోవడం నీచమైన ఆలోచన అని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
పొంగులేటి అధికార అహంతో తన విచక్షణను కోల్పోయారని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడే భాషలా లేదని? ఫ్యాక్షన్ లీడర్లా ఆయన బెదిరిస్తున్నారా? అని దాసోజు ప్రశ్నించారు. పొంగులేటి చేతిలో ఉన్నది రెవెన్యూ, హౌసింగ్ శాఖ లు మాత్రమేనని, కానీ ఆయన మాట విం టుంటే అసలు రాష్ట్రంలో హోమ్ మంత్రి ఉన్నారా? లేదా? అనే అనుమానం కలుగుతున్నదని చెప్పారు. ఇప్పటివరకు ఎంతమంది రైతులకు పూర్తి రుణమాఫీ అ య్యిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ వి సిరారు. రుణమాఫీ కాక, రైతు భరోసా రాక అన్నదాతలను ఆత్మహత్యలకు గురిచేస్తున్న మీ పాలనకు వాత పెట్టాలని ఆగ్ర హం వ్యక్తంచేశారు. హరీశ్‌రావు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే నోరు మూసుకోవాలని, లేకపోతే ప్రజలే మీ కుర్చీ కింద ఉన్న రెవెన్యూను, మీకున్న పొలిటికల్ హౌసింగ్‌ను ఖాళీ చేయించడం ఖాయం అని దాసోజు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

