హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భాగమైన షేక్‌పేటలో దొంగ ఓట్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. టోలిచౌకిలోని డైమండ్ హిల్స్ పోలింగ్ బూత్ 66, 67లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎంఐఎం నేతలు కొందరితో దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారంతో బీఆర్ఎస్ లీగల్ సెల్ సెక్రటరీ లలితారెడ్డి అక్కడికి చేరుకుని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో ఎంఐఎం, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంఐఎం కార్యకర్తలను వదిలేసి, బీఆర్ఎస్ శ్రేణులపై విరుచుకుపడ్డారు. దీంతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అక్కడకు చేరుకుని నిలదీశారు. బోగస్ ఓటర్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని ప్రశ్నించడంతో క్కడి నుంచి ఆయనను కూడా దౌర్జన్యంగా పంపించేశారు.
షేక్‌పేటలోని సమతా కాలనీ అపెక్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన 4, 5, 7, 8 బూత్‌ల పరిధిలో పోలీసులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహిరించడంపై ఎమ్మెల్సీ దాసోజు నిలదీశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటరు స్లిప్పులు పంచేందుకు ఏర్పాటు చేసిన టేబుళ్లను ఎందుకు తీయించారని ప్రశ్నించారు.