KCR | అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, ప్రజల సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.