BRS | సిటీ బస్సుల్లో చార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన.. వీడియో
సిటీ బస్సుల్లో చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తంచేశారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించి నిరసన తెలిపారు.
హైదరాబాద్: సిటీ బస్సుల్లో చార్జీల పెంపునకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తంచేశారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బస్ చార్జీల పెంపుతో ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రయాణికులకు వివరించారు. పేదలపై నెలకు రూ.5వందల వరకు అధనపు భారం పడుతుందని ప్రయాణికులు వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో కలిసి నినాదాలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉచితంగా ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల దగ్గర చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపారని విమర్శించారు. ఇప్పటికే విద్యార్థుల బస్‌పాస్ చార్జీలు పెంచారని వెల్లడించారు. మార్పు అంటే సామాన్య ప్రజలపై భారం మోపడమేనా అని ప్రశ్నించారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించి గట్టి బుద్ధి చెప్పాలన్నారు. సామాన్య ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
హైదరాబాద్ సిటీ బస్సుల్లో టికెట్ చార్జీల పెంపుకు నిరసనగా సిటీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు @D_SudheerReddy, @KaleruVenkatesh, @MutaGopal.
చార్జీల భారం ప్రయాణికులపై ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్… pic.twitter.com/q5IDcbsSei
— BRS Party (@BRSparty) October 7, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- BRS MLAs
- Bus Fare Hike
- city bus
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

