హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాలయానికి వెళ్లింది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని నినానాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నాను కవర్ చేయకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. శాసనసభ ఆవరణలో మీడియా ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. మీడియా ప్రతినిధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
అసెంబ్లీ దగ్గరున్న గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా
పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్క్వాలిఫై చేయాలని నినాదాలు
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరాలని వచ్చిన ఎమ్మెల్యేలు
స్పీకర్ అందుబాటులో… https://t.co/JILKAGBbsC pic.twitter.com/4f7IFD8dad
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2025