MLA Sudheer Reddy | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల దోపిడీ అంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సోషల్ మీడియాలో లీక్ చేసింది. కాళేశ్వరం నీళ్ళతోనే తెలంగాణ పంటల సాగు విస్తీర్ణంలో మొదటి స్థానంలో నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలు ప్రజలకు చెప్పాలని స్పీకర్ను కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం బీఆర్ఎస్కు అసెంబ్లీలో ఇవ్వాలని కోరాము. మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇస్తే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.