కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని తెలిపారు. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారిందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతను మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, అది తప్పా అని మండిపడ్డారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపిస్తూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు వాకింగ్‌కు వచ్చిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే నరేందర్ రెడ్డిని వికారాబాద్‌కు తరలించారు. కాగా, నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ భగ్గుమంది. కొడంగల్ నియోజకవర్గవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చింది.