హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పీ మహేందర్‌రెడ్డి ఉన్నారు.