హుజూరాబాద్ టౌన్, నవంబర్ 6: ‘దళితబంధు రెం డో విడత నిధులను ఈ నెల 20లోగా ఇవ్వకపోతే హుజూరాబాద్ నియోజకవర్గం రణరంగం అవుతది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులను స్థానికంగా తిరగనివ్వం’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్‌లోని సుమారు 20 వేల కుటుంబాలను ఆదుకున్నారని గుర్తుచేశారు. దళితబంధు రెండో విడత డబ్బులు వారి అకౌంట్లలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలను ఫ్రీజ్ చేసి దళితులను దగా చేస్తున్నదని విమర్శించారు. ఈ నెల 9న హుజూరాబాద్‌లోని తన ఇంటి వద్ద టెంట్ వేసుకొని కూర్చుంటానని, దళితబంధు రెండో విడత రాని వారంతా వచ్చి దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఆ దరఖాస్తులను తానే స్వయంగా కలెక్టర్‌కు ఇస్తానని తెలిపారు.