హైదరాబాద్, మార్చి 13 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో 15 స్కామ్‌లు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో వచ్చిన కరెం టు, రైతుబంధు ఇప్పుడెందుకు రావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను ఎండబెడుతున్నదని ఆరోపించారు. సీఎం హోదాలో రేవంత్ మాట్లాడుతు న్న తీరును ప్రజలు గమనిస్తున్నారని.. రాష్ర్టాన్ని తేవడంతోనే కేసీఆర్‌కు కొండంత పేరొచ్చిందని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. రైతుబంధు రావడం లేదని ప్రశ్నించిన ఓ రైతు వీడియోను షేర్ చేసినందుకు జర్నలిస్టులను అరెస్ట్ చేశార ని.. ఇది ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ అని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, మార్చి 13 (నమస్తేతెలంగాణ): గవర్నర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే ఉ న్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి విమర్శించా రు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రైతు భరోసా, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయనేలేదని, వరికి బోన స్ చెల్లించలేదని ధ్వజమెత్తారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన నిధులు కూడా సక్రమంగా చెల్లించడం లేదని, అయినా అన్నీ అమలు చేస్తున్నట్టు గవర్నర్‌తో అవాస్తవాలను చెప్పించారని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మం డిపడ్డారు. తొలి సీఎంగా కేసీఆర్ రాష్ర్టా న్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో నడిపించారని, ఆయనను మించి తెలంగాణ ను ప్రేమించే వారు మరొకరు లేరని స్పష్టంచేశారు. నాడు కేసీఆర్ పదేండ్లు సాగు, తాగునీటి సమస్యలే లేకుండా చేస్తే, నేటి కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యంతో వేలాది ఎకరాల పంటపొలాలు ఎండుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.