Padi Kaushik Reddy | హుజురాబాద్ : రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆవేశం స్టార్ అని పేరు పెడుదామనుంటకున్నామని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికారులను బలి చేస్తున్న పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ తరపున దానం నాగేందర్‌ను సికింద్రాబాద్ స్థానానికి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. వెంటనే దానంపై వేటు వేయాలని స్పీకర్‌ను కోరుతున్నామన్నారు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక ఆడియో లీక్ అయింది. ఆర్టీవో, ఎమ్మార్వోకు కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ఎమ్మెల్యే చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పించొద్దని ఆదేశించారు. హుజురాబాద్ నియోజవకర్గ ప్రజలకు వ్యతిరేకంగా పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తున్నారు. పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ గడ్డ మీది నుంచి ఛాలెంజ్ విసురుతున్నాను. అమాయకులైన ఆర్డీవో, ఎమ్మార్వోను ఎందుకు బలి చేయాలనుకుంటున్నారు. తాను ఆర్డీవో, ఎమ్మార్వోతో మాట్లాడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. మీ ఆడియోలు లీక్ అయింది మీ ఆఫీసు నుంచి. నీ ఆఫీసులో ఏం జరుగుతుంతో నీకు తెల్వకపోతే అమాయకులైన ఆర్డీవో, ఎమ్మార్వోను బలి చేయడం ఏంది..? మంత్రివర్గ స్థానం నుంచి పొన్నం ప్రభాకర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను అని కౌశిక్ రెడ్డి తెలిపారు.
పొన్నం ప్రభాకర్‌కు ఆవేశం స్టార్ అని పేరు పెడుదాం అనుకుంటున్నాం. ఈ ఆవేశం స్టార్‌కు సంబంధించి నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. హుస్నాబాద్ నుంచి తిరుపతి గౌడ్ అనే వ్యక్తి ఫోన్ చేస్తే బండ బూతులు తిట్టారు. కరీంనగర్ ప్రజలు నిన్ను తరిమేస్తే.. హుస్నాబాద్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఈ మాటలు మాట్లాడుతావా..? ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు.. సద్వినియోగం చేసుకోవాలి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ప్రోటోకాల్ ఉల్లంఘన చేయొద్దని అధికారులను కూడా కోరుతున్నాను. పొన్నం ప్రభాకర్ మాటలు వింటే కుక్క తోక పట్టుకుని గోదావరిని ఈదినట్టు ఉంటది అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.