Padi Kaushik Reddy | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి కలిసి నా ఫోన్ను ట్యాప్ చేస్తున్నారని, వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బంజారాహిల్స్ ఏసీపీకి బుధవారం పొద్దున్నే ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు. నేను పోలీస్ స్టేషన్ వెళ్ళేకన్నా ముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ కూడా వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే మా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారు. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి తెలియదా..? ఎలాంటి పదవులు లేని సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారు అని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
నా ఫోన్ ట్యాప్ అవుతుంది అనేది నా ప్రధాన ఆరోపణ. సీఎం రేవంత్ రెడ్డి ,ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నేను ఓ మిత్రుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి పోలీసులను పంపించారు. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారు. కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, శివధర్ రెడ్డిపై కేసు బుక్ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే అని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
మా నేత హరీష్ రావుపై బ్రోకర్ రేవంత్ రెడ్డి సూచనతో బ్రోతల్ చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టారు. బ్రోకర్, బ్రోతల్లు కేసు పెడితే పోలీసులు హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు..? హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే నా కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. నేనిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూ కంపం వచ్చింది. సీఎం పాపాల నుంచి ప్రజలను దేవుళ్ళే కాపాడాలి. వచ్చేది మా ప్రభుత్వమే.. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న పోలీసులపై చర్యలు తప్పవని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడంలో రాటుదేలిండు.. కేటీఆర్ ఫైర్
KTR | అప్పుల లెక్కలు కాదు.. హమీల లెక్కలు చెప్పు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్