KTR | హైదరాబాద్ : ఇంకా తిట్టాలనుకుంటే.. ఇంకో రెండు గంటలు తిట్టుకోండి రేవంత్ రెడ్డి.. నాకేం ఇబ్బంది లేదు.. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, ఆశీర్వాదాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిదని కేటీఆర్ పేర్కొన్నారు.
శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్టేషన్, ఆవేశం.. అయ్యాయ్యో పదవిలో వచ్చినాక కూడా ఇంత ఫ్రస్టేషన్‌ను నా జీవితంలో ఎవరిలో చూడలేదు. ఇంత దాడి, ఉక్రోషం.. మీ వల్ల రాబోయే 20 ఏండ్లు కాంగ్రెస్‌కు ఓటేయ్యాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానాలో ఎన్నికల ప్రచారం చేశారు.. అద్భుతాలు సాధించారు. మీరు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. 57 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు కానీ.. ఎన్నికల్లో ఓట్లు వేయలేదు అని కేటీఆర్ తెలిపారు.
రంకెలతో ఏం రాదు.. ప్రతిపక్షాల మీ దాడి చేస్తే ఏం కాదు. మీరు అధికారంలోకి వచ్చాక పెద్ద వాగు రెండుసార్లు కొట్టుకుపోయింది. సుంకిశాల కూలిపోయింది. భక్తరామదాసు మోటార్లు మునిగిపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు.