KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళలు దూషిస్తున్న వైనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అమ్మతోడు.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని కూడా నాకు తెలియదు అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పాలన అంటే ఏంటో ఇప్పుడిప్పుడే మనోళ్లకు అర్థమవుతుంది. నిజంగా చెబుతున్నా.. మీరు నమ్ముతరో లేదో తెలియదు కానీ.. అమ్మతోడు చెబుతున్నా.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని నాకు తెలియదు. అరెరె.. ఏం తిట్టుడు అయ్యా అది. భయం లేదు, భక్తి లేదు గొట్టం పెట్టుడే ఆలస్యం.. రమ్మను వాన్ని అంటుర్రు. యేడికెళ్లి వస్తడు వాని భయం వానికుంది.. వస్తే వీపు పగులగొట్టే ఉన్నరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మహిళలు దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే. తులం బంగారం, స్కూటీలు, నెలకు రూ. 2500, పెన్షన్ల పేరుతో తమను మోసం చేసిండని మహిళలు రేవంత్ సర్కార్‌పై ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ పాలనపై మహిళలను పలుకరిస్తే చాలు.. తిట్టకూడని తిట్లతో రేవంత్‌ను ఉతికి ఆరేస్తున్నారు. ఇంకోసారి రేవంత్ రెడ్డి సీఎం అయ్యే ప్రసక్తే లేదని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్.. కడియం శ్రీహరికి కేటీఆర్ సవాల్
KTR | సీఎం రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా బీజేపీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Harish Rao | ఎండాకాలం రాకముందే హైదరాబాద్‌లో నీటి ఎద్దడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్