Jubilee Hills by Poll | హైదరాబాద్ : మన బతుకులకు భరోసానిచ్చిన కారు గుర్తుకు ఓటు వేయాలి.. బీఆర్ఎస్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కలగాలని బోరబండ డివిజన్ ఇంచార్జ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఈరోజు బోరబండ డివిజన్ బాబా సైలానీ నగర్లో మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా వారి కుమార్తెలు దీక్షిత, అక్షితలతో కలిసి కేపీ వివేకానంద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల బ్రతుకులకు భరోసానిచ్చిన పార్టీ బీఆర్ఎస్ అయితే, అబద్ధపు హామీలతో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజలకు మొండి చెయ్యి చూపిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాబట్టి నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో మన బతుకులకు భరోసానిచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ 3వ నెంబర్‌పై ఓటు వేసి మాగంటి సునీత గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.