MLA Jagadish Reddy | సూర్యాపేట : దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని.. భక్తిశ్రద్ధలతో నవరాత్రులు చేసే పూజలు ఫలించి భక్తులు కోరిన కోర్కెలు నెరవేరాలని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్బంగా మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని జేజే నగర్లో గల కనకదుర్గమ్మ తల్లి దేవాలయంతో పాటు చంద్రన్నకుంట, ఇందిరమ్మ కాలనీ, నెహ్రూనగర్, భగత్ సింగ్ నగర్, ఇందిరానగర్ కాలనీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని మాట్లాడారు.
తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో జరుపుకునే దేవీ నవరాత్రులు అంతా ప్రశాంత వాతావరణంలో మరింత ఐక్యతతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా ఆయా మండపాల వద్ద నిర్వాహక కమిటీ తో పాటు, భక్తులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్బంగా చిన్నారులు, యువత సెల్ఫీలు దిగి సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, మాజీ జెడ్పిటిసి జీడి బిక్షం, మాజీ కౌన్సిలర్లు తాహిర్ పాషా, ఆకుల లవకుశ, బత్తుల జానీ యాదవ్, గాలి సాయికిరణ్ భత్తుల రమేష్ కడారి సతీష్ యాదవ్, శ్రీపాద జానకి రాములు, సారగండ్ల మాణిక్యమ్మ లతోపాటు ఆయా వార్డుల నాయకులు, భక్తులు పాల్గొన్నారు.