సూర్యాపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రైతు భరోసా ఎకరాకు రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నేడు మాటమార్చుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రైతులు కాంగ్రెస్ నేతల గల్లా పట్టి బాకీ వసూలు చేసుకునే రోజులు అతి సమీపంలోనే ఉన్నాయని, రైతుల తిరుగుబాటుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
వానకాలానికి రైతు భరోసా ఇవ్వడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేసిన వ్యా ఖ్యలపై జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మరో మంత్రి కో మటిరెడ్డి వెంకట్రె డ్డి మూసీపై మురికి మాటలు మాట్లాడంపై ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి చేసిన చిల్లర పనులకు ఆ కు టుంబమే ఉరి వేసి చంపుతుందన్నారు. శనివారం జగదీశ్‌రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. వానకాలానికి రైతు భరోసా లేదన్న తుమ్మల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
రైతుల గొంతుకోశారు:కొప్పుల ఈశ్వర్
రెండు పంటలకు రైతుభరోసా ఎగ్గొట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల గొంతుకోశారు. వ్యవసాయశాఖ మంత్రే ఈ వానకాలం పంటకు రైతుభరోసా ఇవ్వమని చెప్పడం సిగ్గుచేటు. కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం చెబుతుందని కేసీఆర్ అనాడే చెప్పారు. ఎకరాకు 15 వేల చొప్పున రైతుభరోసా కోసం కండ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూశారు. పంట కోసి ధాన్యం అమ్మకానికి తీసుకెళ్తున్న సమయంలో మంత్రి చావుకబురు చల్లగా చెప్పారు. ఈ రోజు కాంగ్రెస్ సర్కారు నిజస్వరూపం బయటపడింది.