నల్లగొండ, ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కృష్ణా నది ప్రాజెక్టుల హకులను కోల్పోయామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. కృష్ణా ప్రాజెక్టుల సాగునీటి హకులను కాపాడుకునేందుకు నల్లగొండలో మంగళవారం బీఆర్ఎస్ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభా స్థలిని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, చంటి క్రాంతికిరణ్, రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్‌రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు.
అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేటి సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి రైతులు, ప్రజలు భారీగా హాజరవుతారని తెలిపారు. కేసీఆర్ సభ కోసం కృష్ణా పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. సభకు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కృష్ణా జలాల హక్కులను కేఆర్ఎంబీకి అప్పగించినట్టు ఆరోపించారు.
కేఆర్ఎంబీ ఆధీనంలోకి వెళ్లినా ముఖ్యమంత్రి, మంత్రులు సాగర్ ప్రాజెక్టు వద్దకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగర్ ప్రాజెక్టును ఆక్రమించడానికి ఏపీ వస్తే తరిమేసినట్టు తెలిపారు. కృష్ణా జలాల వివాదం తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్యగా అభివర్ణించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్నాళ్లు కృష్ణా ప్రాజెక్టులు తమ ఆధీనంలోనే ఉండేవని అన్నారు. కృష్ణా జలాల హకులను కేఆర్ఎంబీకి అప్పజెప్పడానికి ఏపీ ప్రభుత్వం ఒప్పుకొన్నా.. అప్పటి బీఆర్ఎస్ సరార్ ఒప్పుకోలేదని తెలిపారు.
ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఏపీ నేతలకు ఏజెంట్లుగా మారి, తెలంగాణ ద్రోహులుగా నిలిచారని మండిపడ్డారు. కృష్ణా జలాల హకు విషయంలో కేంద్రంపై పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు తమపై ఎదురు దాడికి దిగడం దురదృష్టకరమని అన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కృష్ణా జలాల హకులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో మంగళవారం నల్లగొండలో నిర్వహించే సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.