Harish Rao | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ)/ సిద్దిపేట : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబిటాస్ స్కూల్లోని 114వ పోలిం గ్ కేంద్రంలో ఆయన సతీమణి శ్రీనిత, కుమారుడు అర్చిష్మాన్ రావుతో కలి సి ఓటు హక్కు వినియోగించుకున్నా రు.
ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ట్వీట్ చేశారు. ‘బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం కలిగి ఉండి, అంకితభావంతో మీరు పడిన కష్టం, తపన నాతోపాటు అందరికీ స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.