Harish Rao | కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండమే : హరీశ్‌రావు
Harish Rao | సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | వరంగల్ : సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని హరీశ్‌రావు పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
వరంగల్‌లో వెయ్యి పడకల ఆస్పత్రికి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మహబూబాబాద్, జనగామ, ములుగు, నర్సంపేట, భూపాలపల్లికి మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ అని హరీశ్‌రావు గుర్తు చేశారు. అంతేకాకుండా వరంగల్ జిల్లాకు టెక్స్ టైల్ పార్కు, వెటర్నరీ యూనివర్సిటీ ఇచ్చాం. ఇవాళ రేవంత్ తెలంగాణ చిహ్నంలోని కాకతీయ తోరణం తీసేస్తా అంటున్నాడు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నాడు. కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్ని గుండం అవుతుంది. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. ఒక వేళ ఆ చిహ్నంలో కాకతీయ తోరణం తొలగిస్తే కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తారు వరంగల్ జిల్లా ప్రజలు. రేవంత్ రెడ్డి ఏదో ఒక రకంగా కేసీఆర్ మీద అపవాదులు వేయాలని చూస్తున్నారు అని హరీశ్‌రావు తెలిపారు.
ఈ వంద రోజుల్లో ఉద్దెర మాటలే తప్ప ఉద్దరించింది ఏం లేదు..
కాంగ్రెస్ నాయకులు ఏదో ఉద్దరిస్తారు అనుకున్నారు.. కానీ అన్నీ ఉద్దెర మాటలే అన్నది ప్రజలు గుర్తించారు. ఈ వంద రోజుల్లో ఉద్దెర మాటలే తప్ప ఉద్దరించింది ఏం లేదు. అన్నీ ఫేక్, లీక్ వార్తలే. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. హామీలు అమలు కాలేదు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజస్వరూపం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మనం ప్రజలకు వద్దకు వెళ్లి వివరించాలి. నిన్న కేసీఆర్‌కు అద్భుతమైన ప్రజాస్పందన లభించింది. కడియం లాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

