గద్వాల, జూన్ 19: ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బు ధవారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులుగా టీవీలు, న్యూస్‌పేపర్లు, సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నానంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని కొం దరు నాయకులు అడిగిన మాట వాస్తవమేనన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రా వు సారథ్యంలో గతంలో ఎలా పనిచేశామో.. ఇప్పుడు కూడా పార్టీ కోసం అలాగే పనిచేస్తామని చెప్పారు. సమావేశంలో జడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్ మురళి, ఎంపీపీ విజయ్‌కుమార్, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.