హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జ్‌లను కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. పూర్తి డిజిటల్ పద్ధతిలో సాగనున్న ఈ సభ్యత్వ నమోదు కోసం పార్టీ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తుండగా, ప్రస్తుతం అది తుది మెరుగులు దిద్దుకుంటున్నది.
డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను తప్పుల్లేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం పకా ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతోపాటు, ప్రతి నియోజకవర్గానికీ ఒకరు చొప్పున ఎంపిక చేసిన ఐటీ నిపుణులకు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణభవన్‌లో శిక్షణ పొందిన ఈ ఐటీ నిపుణులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఆయా జిల్లాల్లో ఇప్పటికే నియమితులైన పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయాల్లో తదుపరి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తారు.
జిల్లా కేంద్రాల్లో శిక్షణ పూర్తయిన తర్వాత, ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు విప్లవాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్‌ల సంఖ్యను బట్టి.. బూత్‌కు ఇద్దరు చొప్పున కార్యకర్తలను ఎంపిక చేసి, నిర్ణీత తేదీ నుంచి వారంరోజులపాటు ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణ శిబిరాలకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పార్టీ తరఫున భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. రాష్ట్ర కమిటీ నుంచి నియమితులైన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు జిల్లాల వారీగా ఈ మొత్తం వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తారు.
ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా పూర్తయిన వెంటనే, సభ్యత్వ నమోదు ప్రారంభ తేదీని పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. ఆ ప్రకటించిన ముహూర్తం రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్‌సహా పార్టీ ముఖ్య నేతలంతా తమ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, వార్డుల్లో పండుగ వాతావరణంలో ఈ బీఆర్ఎస్ సభ్యత్వ పునరుద్ధరణ, నూతన నమోదు ప్రక్రియ కొనసాగనున్నది. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత పార్టీ అంతర్గత బలోపేతంపై బీఆర్ఎస్ నాయకత్వం దృష్టి పెట్టనున్నది.
ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని రకాల పార్టీ కమిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. నిర్దేశిత గడువులోగా కమిటీల నియామకాలను పూర్తి చేసి, ఆయా నూతన కమిటీల సభ్యులతో పార్టీ ప్రత్యేక శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నది. పూర్తి సాంకేతిక హంగులతో, పకా సంస్థాగత నిర్మాణంతో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో తిరుగులేని శక్తిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యాచరణ సాగుతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆదిలాబాద్ జిల్లా: సిర్పూర్-పాటిమీది జగన్మోహన్రావు, చెన్నూర్ (ఎస్సీ)-తిప్పని లింగన్న, బెల్లంపల్లి (ఎస్సీ)- మిర్యాల రాజిరెడ్డి, మంచిర్యాల- కౌశిక హరి, ఆసిఫాబాద్ (ఎస్టీ)- తొంగల సత్యనారాయణ, ఖానాపూర్ (ఎస్టీ)- సుమిత్రాఆనంద్ తనోబా, ఆదిలాబాద్- రాథోడ్ జనార్దన్, బోథ్ (ఎస్టీ)- ఏ శ్రీకాంత్‌రెడ్డి, నిర్మల్ – మూల రాజిరెడ్డి, ముథోల్- రఘువీర్‌సింగ్.
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్- కాంతారెడ్డి తిరుపతిరెడ్డి, బోధన్- డీ విఠల్‌రావు, జుకల్ (ఎస్సీ)- మఠం భిక్షపతి, బాన్సువాడ-తోట ఆగయ్య, ఎల్లారెడ్డి- దఫేదార్ రాజు, కామారెడ్డి-శేరి సుభాష్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్-రవీందర్‌సింగ్, నిజామాబాద్ రూరల్-గిర్దావర్ గంగాధర్, బాలొండ- దావ వసంత
కరీంనగర్ జిల్లా: కోరుట్ల-లోక బాపురెడ్డి, జగిత్యాల-కే విద్యాసాగర్‌రావు, ధర్మపురి (ఎస్సీ)- మూల విజయారెడ్డి, రామగుం డం- ఏనుగు రవీందర్‌రెడ్డి, మంథని- వీర్ల వెంకటేశ్వర్రావు, పెద్దపల్లి-వెంకట్రామిరెడ్డి, కరీంనగర్-కొండూరి రవీందర్రావు, చొప్పదండి (ఎస్సీ)-పన్యాల భూపతిరెడ్డి, వేములవాడ- గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల-తుల ఉమ, మానకొండూర్ (ఎస్సీ)-పేరాల రవీందర్రావు, హుజూరాబాద్-డాక్టర్ చిరుమిల్ల రాకేశ్, హుస్నాబాద్-జీవీ రామకృష్ణారావు.
మెదక్ జిల్లా: సిద్దిపేట-వంటేరు యాదవరెడ్డి, మెదక్-ఫారూఖ్ హుస్సేన్, నారాయణఖేడ్-జైపాల్‌రెడ్డి, అందోల్ (ఎస్సీ)-పట్నం మాణిక్యం, నర్సాపూర్ -నరహరిరెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ)-దేవీప్రసాద్, సంగారెడ్డి-చంద్రాగౌడ్, పటాన్చెరు-ఎర్రోళ్ల శ్రీనివాస్, దుబ్బాక-కాసాల బుచ్చిరెడ్డి, గజ్వేల్-రాధాకృష్ణశర్మ.
రంగారెడ్డి జిల్లా: మేడ్చల్-రాగిడి లక్ష్మారెడ్డి, మలాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-కే నవీన్‌రావు, కూకట్పల్లి- గజ్జెల నగేశ్, ఉప్పల్-గొంగిడి మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం-స్వామిగౌడ్, ఎల్బీనగర్-నాగేశ్ముదిరాజ్, మహేశ్వరం-వాణీదేవి, రాజేంద్రనగర్-రావుల శ్రీధర్‌రెడ్డి, శేరిలింగంపల్లి-శంభీపూర్ రాజు, చేవెళ్ల (ఎస్సీ)-రాంబాబుయాదవ్, పరిగి-ఎంఎన్ శ్రీనివాస్, వికారాబాద్ (ఎస్సీ)-గట్టు రాంచందర్‌రావు, తాండూరు-విప్లవ్‌కుమార్.
హైదరాబాద్ జిల్లా: ముషీరాబాద్-వెంకట్‌రెడ్డి, అంబర్‌పేట-కోలేటి దామోదర్‌గుప్తా, ఖైరతాబాద్-దాసోజు శ్రవణ్, జూబ్లీహిల్స్-విష్ణువర్ధన్‌రెడ్డి, సనత్‌నగర్-గోసుల శ్రీనివాస్‌యాదవ్, సికింద్రాబాద్-ఎండీ సలీం, కంటోన్మెంట్ (ఎస్సీ)-మన్నె క్రిశాంక్, నాంపల్లి-షేక్ అబ్దుల్లా సోహైల్, కార్వాన్-ఇనాయత్ అలీ బాఖ్రీ, గోషామహల్ -గౌండ్ల నాగేందర్‌గౌడ్, చార్మినార్ -అలీబిన్ ఇబ్రహీం మసతి, చాంద్రాయణగుట్ట-షాహీన్ అఫ్రోజ్, యాకుత్‌పురా-అర్షద్ అలీఖాన్, బహదూర్‌పురా-ఎస్ఏ ఖైసర్, మలక్‌పేట-మహ్మద్ ఆజమ్ అలీ
మహబూబ్‌నగర్ జిల్లా: కొడంగల్-నవీన్‌కుమార్‌రెడ్డి, నారాయణపేట-రాజీవ్‌సాగర్, మహబూబ్‌నగర్-వాల్యానాయక్, జడ్చర్ల-పాల్వాయి స్రవంతి, దేవరకద్ర-పల్లె రవికుమార్, మక్తల్-దూదిమెట్ల బాలరాజు, వనపర్తి-మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, గద్వాల-ఆంజనేయగౌడ్, అలంపూర్ (ఎస్సీ)-చల్లా వెంకట్రామిరెడ్డి, నాగర్‌కర్నూలు-జహంగీర్, అచ్చంపేట (ఎస్సీ)-శుభప్రద్‌పటేల్ నూలి, కల్వకుర్తి-రజిని సాయిచంద్, షాద్‌నగర్-బైకాని శ్రీనివాస్‌యాదవ్, కొల్లాపూర్-అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి
నల్లగొండ జిల్లా: దేవరకొండ (ఎస్టీ)-చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగార్జునసాగర్-బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడ- బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్నగర్-కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడ-తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేట-ఇస్లావత్ రాంచందర్‌నాయక్, నల్లగొండ-ఎంసీ కోటిరెడ్డి, మునుగోడు-వెంకట నారాయణగౌడ్, భువనగిరి-క్యామ మల్లేశ్, నకిరేకల్ (ఎస్సీ)-గుజ్జ దీపిక యుగంధర్‌రావు, తుంగతుర్తి (ఎస్సీ)-ఎలగందుల వెంకటేశ్వర్, ఆలేరు -బండ నరేందర్‌రెడ్డి.
ఖమ్మం జిల్లా: పినపాక (ఎస్టీ)-దిండిగాల రాజేందర్, ఇల్లందు (ఎస్టీ)-చాడ కిషన్‌రెడ్డి, ఖమ్మం-ఏనుగుల రాకేశ్‌రెడ్డి, పాలేరు-తాతా మధు, మధిర (ఎస్సీ)-నామా నాగేశ్వరరావు, వైరా (ఎస్టీ)-ఆర్జేసీ కృష్ణ, సత్తుపల్లి (ఎస్సీ)-కూరాకుల నాగభూషణం, కొత్తగూడెం-వద్దిరాజు రవిచంద్ర, అశ్వారావుపేట (ఎస్టీ)-ఉప్పల వెంకటరమణ, భద్రాచలం (ఎస్టీ)-రావలపల్లి రాంప్రసాద్.
వరంగల్ జిల్లా: జనగామ-బండా శ్రీనివాస్, ఘనపూర్ (ఎస్సీ)-నాగుర్ల వెంకన్న, పాలకుర్తి-ఎం సుధీర్‌కుమార్, డోర్నకల్ (ఎస్టీ)-మాలోత్ కవిత, మహబూబాబాద్ (ఎస్టీ)- వై సతీశ్‌రెడ్డి, నర్సంపేట-ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరకాల-సమ్మారావు, వరంగల్ పశ్చిమ- వాసుదేవరెడ్డి, వరంగల్ తూర్పు-మర్రి యాదవరెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ)-మసూద్, భూపాలపల్లి-రామస్వామినాయక్, ములుగు (ఎస్టీ)-గండ్ర జ్యోతి.