BRS | 71 వేల మందితో సభ్యత్వ నమోదు.. డిజిటల్ బాటలో బీఆర్ఎస్.. పూర్తిస్థాయి కసరత్తు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
BRS | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలో మంగళవారం నిర్వహించిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పలు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఆరు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత ఎన్నికల సంఘం అనుసరిస్తున్న డిజిటల్ విధానాల తరహాలోనే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కూడా ఈసారి పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిలో చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో, బూత్‌కు ఇద్దరు చొప్పున మొత్తం 71,310 మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
డిజిటల్ మెంబర్ షిప్ ప్రక్రియపై పార్టీ ప్రధాన కార్యదర్శుల పర్యవేక్షణలో శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మండలిలో ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు చాగండ్ల నరేంద్రనాథ్, సోమా భరత్ కుమార్‌గుప్తా, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్య నిర్ణయాలు ఇవే
- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ‘సర్’ ప్రక్రియతోపాటు, ఓటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డిజిటలైజేషన్ పద్ధతిలో జరుపాలి.
- ప్రతి నియోజకవర్గానికీ, రాష్ట్ర కమిటీ నుంచి సభ్యత్వ సమన్వయకర్తనూ నియమించాలి.
- ప్రతి మండలానికీ, మున్సిపల్ బాడీలవారీగా సభ్యత్వ నమోదు సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీలను 2,3 రోజుల్లో నియమించాలి.
- డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున, రాష్ట్రంలో ఉన్న 35,655 పోలింగ్ బూత్‌లలో, బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. డిజిటల్ మెంబర్షిప్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలపై శిక్షణ ఇవ్వాలి.
- సభ్యత్వ నమోదు, డిజిటల్ పద్ధతిలో చేపట్టేందుకు శిక్షణ శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలి.
సభ్యత్వ నమోదు కోసం నియమితులైన జిల్లాల ఇన్చార్జులు వీరే
- ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు : తకళ్లపల్లి రవీందర్రావు (ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి)
- జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల: జీవన్‌రెడ్డి (మాజీ మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి)
- ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ : సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి)
- జనగామ, హనుమకొండ, వరంగల్: పల్లా రాజేశ్వర్‌రెడ్డి (ఎమ్మెల్యే, పార్టీ ప్రధాన కార్యదర్శి)
- మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట : గ్యాదరి బాలమల్లు (పార్టీ ప్రధాన కార్యదర్శి)
- నిజామాబాద్, కామారెడ్డి : గంగాధర్‌గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి)
- మంచిర్యాల, ఆసిఫాబాద్ : నారదాసు లక్ష్మణ్‌రావు (మాజీ ఎమ్మెల్సీ, పార్టీ ప్రధాన కార్యదర్శి)
- ఆదిలాబాద్, నిర్మల్ : రావుల శ్రావణ్‌కుమార్‌రెడ్డి (పార్టీ ప్రధాన కార్యదర్శి)
- వికారాబాద్, రంగారెడ్డి : సబితాఇంద్రారెడ్డి (మాజీ మంత్రి, ఎమ్మెల్యే)
- మహబూబ్‌నగర్, నారాయణపేట: మహమూద్ అలీ (మాజీ మంత్రి)
- గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి: మెట్టు శ్రీనివాస్ (పార్టీ కార్యదర్శి)
- మేడ్చల్-మలాజిగిరి, యాదాద్రి భువనగిరి : పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఎమ్మెల్సీ, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్)
- హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్‌యాదవ్ (మాజీ మంత్రి, ఎమ్మెల్యే)
- నల్లగొండ, సూర్యాపేట : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (పార్టీ ప్రధాన కార్యదర్శి)

మంగళవారం ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్, హరీశ్‌రావు, మధుసూదనాచారి, సబిత, సురేశ్‌రెడ్డి, బండా ప్రకాశ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, సంతోష్‌కుమార్, జీవన్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , శ్రవణ్ కుమార్ రెడ్డి, రావుల చంద్ర శేఖర్ రెడ్డి , సోమా భరత్ కుమార్, నారదాసు లక్ష్మణరావు, గంగాధర్ గౌడ్, చాగల్ల నరేంద్ర నాథ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS membership
- harish rao
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

