త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. చివరిరోజున నల్లగొండ లోక్సభ నియోజకవర్గ సమావేశం సన్నాహక సమావేశం జరగనున్నది. ఇదే నెల 3న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంతో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రోజుకొకటి చొప్పున లోక్సభ నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటుచేసి వాటిపరిధిలోని ముఖ్య నాయకులను ఆహ్వానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై చర్చిస్తూ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు, పార్టీ పటిష్ఠానికి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ వచ్చారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు జరిగిన ఈ సమావేశాల్లో తమ సలహాలు, సూచనలను పార్టీ ముఖ్య నేతలు వినడం, ఉత్తేజాన్ని నింపడంతో పార్టీ క్యాడర్లో నూతనోత్సాహం వచ్చింది. అసెంబ్లీ నియోజకవర్గాల వా రీగా సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నారు.