రేవల్లి, ఏప్రిల్ 8 : వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘరామారావు (60) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గ్రామానికి చేరుకొని రామారావు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రఘురామారావు లేకపోవడం ఈ ప్రాంత ప్రజలకు, పార్టీకి.. ముఖ్యంగా తనకు తీరని లోటని నిరంజన్‌రెడ్డి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని రఘరామారావు పాడె మోశారు. ఆయనతోపాటు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.