Rythu Sangrama Sadassu | రైతు సంగ్రామ సదస్సులో నాలుగు తీర్మానాలు చేసిన బీఆర్ఎస్
Rythu Sangrama Sadassu | రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దని.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Rythu Sangrama Sadassu | రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దని.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. రెండేళ్లలో రాబంధు రాజ్యం పోయి.. రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన నాలుగు తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు.
1. కాంగ్రెస్ రాబంధు పాలనలో వెయ్యి మందికిపైగా రైతులు చనిపోయారని.. రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
2. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలను వెంటనే అమలు చేయాలి.
3. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి.
4. రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు రుణ విముక్తి కల్పించాలి. రైతుబంధు సక్రమంగా వేయాలి. రైతు బీమా పథకాలను వెంటనే పునరుద్ధరించాలి.
రైతు సంగ్రామ సదస్సులో చేసిన తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే
1)కాంగ్రెస్ పాలన వల్ల బలైన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి
2)రైతు డిక్లరేషన్ లోని హామీలు అమలు చేయాలని
3)అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలి… pic.twitter.com/ZZ5bjiAVGI— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

