జోగులాంబ గద్వాల : ఇథనాల్ ఫ్యాక్టరీగా(Ethanol company) వ్యతిరేకంగా ప్రజల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద దన్వాడ గ్రామంలో జీఆర్ఎఫ్ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని గ్రామస్తులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఏడవ రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి( Venkatrami Reddy), ఎమ్మెల్యే విజయుడు(MLA Vijayudu) వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కంపెనీ రద్దు అయ్యేంతవరకు మీతో పాటు కృషి చేస్తామన్నారు. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.
కాగా, వీరి దీక్షకు చుట్టుపక్కల ఉన్న 11గ్రామాలకు చెందిన రైతులు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మండలంలోని వివిధ గ్రామాల్లోని పంట భూములు నాశనమవుతాయని ఆవేదన వ్య క్తం చేశారు. అంతేకాకుండా పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా తుంగభద్ర నదితోపా టు పరిసర గ్రామాల్లో తాగునీరు కూడా కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభు త్వం వెంటనే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.