తాండూర్, ఫిబ్రవరి 1 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను, వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నాయకులపై విచారణలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మంచిర్యాల జిల్లా తాండూర్ మండల బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సిట్ విచారణ పేరుతో కేసీఆర్ పై కక్ష్య సాధింపు ధోరణితో ప్రభుత్వం వేధిస్తోందంటూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సూచనల మేరకు ఆదివారం తాండూర్ ఐబీ కేంద్రంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు పంపడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడం తగదన్నారు. ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తీవ్రం చేయ ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పై ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి, మాజీ ఎంపీపీ ప్రణయ్, ఉప సర్పంచ్ గట్టు సంతోష్, మాజీ ఎంపీటీసీలు శంకర్, నారాయణ, నాయకులు రాజన్న, బోడ సతీష్, మణి కుమార్, దుర్గం శ్రీను, ఎల్క రాంచందర్, చింటూ, బాబూ ఖాన్, భరత్, బాలు.. వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.