హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట నడపాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో 30 మంది మాట్లాడారు. పార్టీ నేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు, ఆదర్శ్‌రెడ్డి, సత్యవతి, వాల్యానాయక్, సోహై ల్, పాల్వాయి స్రవంతి, క్యామ మల్లే శ్, దాసోజు శ్రవణ్, మసివుల్లాఖాన్, చంద్రగౌడ్, మూల విజయారెడ్డి, మె ట్టు శ్రీనివాస్, వీరభద్రరావు, రాజావరప్రసాద్, రాకేశ్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, దాసరి ఉష మాట్లాడారు.
‘ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూ స్తుంటే బీఆర్ఎస్ బీఫా రం తెచ్చుకున్న ఎవ్వరై నా ఎమ్మెల్యేలవుతారు. పార్టీ కోసం పనిచేద్దాం. ప్రజా సమస్యలపై పోరాటాలు చేద్దాం.
– శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి
ఇది ఒక్క బీఆర్ఎస్ ఉత్సవం కాదు. తెలంగాణ ప్రజల ఉత్సవం. చరిత్ర రచ న జరగాల్సిన అవస రం ఉన్నది.
– దేశపతి శ్రీనివాస్
పార్టీకి అద్భుతమైన కార్యకర్తల బలం ఉన్న ది. సోషల్ మీడియాపై నా పార్టీ ఇంకా దృష్టి పెట్టాలి. శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిచేసుకుం టే మరింత బలోపేతం అవుతుంది.
– తాతామధు, ఎమ్మెల్సీ
నాకు ఏ బాధ్యత అప్పగించి చేస్తా. ఈ ప్రభుత్వం అవార్డు ఇ చ్చింది. కేసీఆర్ అనుమతిస్తేనే తీసుకుంటా.
– గోరటి వెంకన్న
రజతోత్సవ సాం స్కృతిక కార్యక్రమా లను ఏడాది పాటు నిర్వహించుకుందాం. ప్రభుత్వ దుర్మార్గాన్ని ఎండగడుతూ పార్టీ గొప్పతనాన్ని వివరించేలా పాటలు, నాటకాలు రూపొందిద్దాం.
– రసమయి బాలకిషన్
బీఆర్ఎస్ రజతోత్స వ సంబురాలను 52 దేశాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. ఈ మేరకు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఏర్పాట్లు చేస్తున్నది. ఏదైనా ఒక దేశానికి కేసీఆర్ కూడా వస్తే బాగుంటుంది.
– మహేశ్ బిగాల
కేసీఆర్ అమలు చే సిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేసీఆ ర్ గురించి ఇన్వెస్ట్మెం ట్ బ్యాంకర్ అనిల్‌కుమార్ అద్భుతంగా చెప్పారు. అలాంటి వాటిని మనం విస్తృతంగా ప్రచారం చేయాలి.
– పంజుగుల శ్రీశైల్‌రెడ్డి
బీఆర్ఎస్ ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేపట్టాలి. ఇందుకోసం ప్ర త్యేకంగా యాప్ రూ పొందించి నిర్వహించాలి. సోషల్ మీడి యాను పటిష్టం చేయాలి
– విలాస్‌రావు